జిల్లాల వారీగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసే వారి వివరాలు..

Sat,June 22, 2019 08:37 PM

trs party offices foundation stones will be done by these leaders

హైదరాబాద్: జిల్లాల వారీగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసే వారి వివరాలను పార్టీ వెల్లడించింది. జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షించారు. ఈనెల 24న పార్టీ కార్యాలయాలకు మంత్రులు, జెడ్పీ చైర్మన్లు భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ చేయనున్న మంత్రులు, జడ్పీ చైర్మన్లతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు.

పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం. సోమవారం భూమిపూజ నిర్వహించే స్థలాలను పరిశీలించాలి. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పార్టీ అన్ని విధాల సహకరిస్తుంది. నిర్మాణం సత్వరంగా పూర్తి అయ్యేట్లు చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలు తీసుకోవాలి. పార్టీ కార్యాలయాల నమూనాను పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారని కేటీఆర్ తెలిపారు.

పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసేది వీళ్లే..


కరీంనగర్ - మంత్రి ఈటల రాజేందర్
నిర్మల్ - మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిజామాబాద్ - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
జగిత్యాల - మంత్రి కొప్పుల ఈశ్వర్
జనగామ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సూర్యాపేట - మంత్రి జగదీశ్ రెడ్డి
మేడ్చల్ - మంత్రి మల్లారెడ్డి
మహబూబ్‌నగర్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
జోగులాంబ గద్వాల - మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఆసిఫాబాద్ - జెడ్పీ చైర్‌పర్సన్ కోవాలక్ష్మీ
మంచిర్యాల - జెడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మీ
ఆదిలాబాద్ - జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్
కామారెడ్డి - జెడ్పీ చైర్‌పర్సన్ దాపేదార్ శోభ
సిరిసిల్ల - జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ
పెద్దపల్లి - జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
జయశంకర్ భూపాలపల్లి - జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిని
మహబూబాబాద్ - జెడ్పీ చైర్‌పర్సన్ అంగోత్ బిందు
ములుగు - జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్
భద్రాద్రి కొత్తగూడెం - జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
నల్గొండ - జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి - జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి
సిద్దిపేట - జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ
మెదక్ - జెడ్పీ చైర్ పర్సన్ హేమలత
సంగారెడ్డి - జెడ్పీ చైర్‌పర్సన్ పటోళ్ల మంజుశ్రీ
రంగారెడ్డి - జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితరెడ్డి
వికారాబాద్ - జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి
నారాయణపేట - జెడ్పీ చైర్‌పర్సన్ వనజమ్మ
నాగర్ కర్నూల్ - జెడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి

3625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles