జోరుగా కొనసాగుతోన్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

Tue,July 9, 2019 04:09 PM

Trs party membership programme continues in districts


హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 5వ వార్డు శ్రీనివాస కాలనీలో ఇవాళ టీఆర్ఎస్ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఇంచార్జి, రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య, మాజీ శాసన సభ్యులు చౌలపల్లీ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, బజార్ హత్నూర్ మండలాల్లో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు పాల్గొన్నారు. మరోవైపు నేరడిగొండలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న డిడిసి చైర్మన్ భూమా రెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్ధన్, మాజీ ఎంపీ నగేష్ పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే సక్కు పలువురు మహిళలకు పార్టీ సభ్యత్వ రసీదు అందజేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ లో టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ బాల మల్లు, మురళి యాదవ్ పాల్గొన్నారు.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles