టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటడం సంతోషం : కేటీఆర్

Wed,July 31, 2019 04:39 PM

TRS Party Membership crosses 50 lakhs says KTR

హైదరాబాద్ : నెల రోజుల్లోనే టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటడం సంతోషకరంగా ఉందని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూన్ 27న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇంకా కొన్ని జిల్లాల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతోంది. సభ్యత్వాల నమోదులో కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ తరపున రూ. 2 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. బీమా కంపెనీకి ప్రీమియం మొత్తాన్ని ఈ రోజే అందజేశామన్నారు. రూ. 11 కోట్ల 21 లక్షల బీమా ప్రీమియం చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి కేటీఆర్ అందజేశారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతిపక్షాలకు సమస్యలు లేవు. ప్రతిపక్షాలు ఎంత అరిచినా తాము పట్టించుకోం. ఎలాంటి ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ప్రతిపక్షాలకు అర్థమైంది. గవర్నర్ తమకు తండ్రి లాంటి వారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశాను. అన్ని గ్రామ, మండల కమిటీలను పటిష్టం చేస్తున్నాం. కమిటీల ఏర్పాటు తర్వాత త్వరలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాం. దేశంలోనే క్రమశిక్షణ గల కార్యకర్తలుగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు.

1036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles