ఏకాభిప్రాయం మేరకే వరంగల్ మేయర్ ఎన్నిక

Fri,April 26, 2019 01:09 PM

TRS party begins exercise for Warangal Mayor

వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక ఏకాభిప్రాయం మేరకే ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మేయర్ ఎంపికపై ఇవాళ వరంగల్ సునీల్ గార్డెన్స్‌లో కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేయర్ ఎన్నిక బాధ్యులు బాలమల్లు, మండలి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, ఆరూరి రమేశ్ హాజరయ్యారు. మేయర్‌గా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై కార్పొరేటర్ల అభిప్రాయాలను నేతలు తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మేయర్ ఎవరనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. కార్పొరేటర్లు అందరూ సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 300 కోట్లు కేటాయిస్తున్నారు. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కల త్వరలోనే సాకారమవుతుందని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

1752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles