టీఆర్ఎస్ ఆస్ట్రేలియా “ వేడుకలకు దూరం..

Fri,February 15, 2019 05:51 PM

trs party australia wing announced no kcr birthday celebration

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరపడం లేదని టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ప్రకటించింది. కశ్మీర్‌లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, 42 మందిని ప్రాణాలను బలిగొన్న సంధర్బంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను జరపడం లేదన్నారు. ప్రతీ సంవత్సరం అంగరంగ వైభవంగా వేడుకలు జరిపే టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఈ సారి ఎటువంటి వేడుకలు జరపడం లేదని తెలిపారు.

ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు వీరమరణం పొందిన జవానుల ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేయాలనీ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. దేశం పై ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే, వారికి వారి బాషలోనే సమాధానం చెప్పే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు జాతీయ రాజకీయాల్లో క్రియ శీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని నాగేందర్ రెడ్డి తెలిపారు .

703
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles