నేడు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Thu,June 13, 2019 07:37 AM

TRS parliamentary party meeting today

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్‌సభాపక్ష నేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, విడుదల కావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై చర్చించనున్నారు. సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సమాచారం అందింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి 9 మంది గెలువగా.. ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 15 మంది ఎంపీలు సమావేశానికి హాజరుకానున్నారు.

648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles