రేపు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Wed,June 12, 2019 04:04 PM

TRS Parliamentary party meeting on June 13

హైదరాబాద్ : ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే.

టీఆర్‌ఎస్ ఎంపీలు వీరే.. పి. రాములు(నాగర్‌కర్నూల్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(మహబూబ్‌నగర్), మాలోత్ కవిత(మహబూబాబాద్), నామా నాగేశ్వర్‌రావు(ఖమ్మం), రంజిత్ రెడ్డి(చేవెళ్ల), బీబీ పాటిల్(జహీరాబాద్), పసునూరి దయాకర్(వరంగల్), కొత్త ప్రభాకర్ రెడ్డి(మెదక్), నేతకాని వెంకటేశ్(పెద్దపల్లి).

1164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles