టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

Thu,June 13, 2019 02:39 PM

TRS Parliamentary Party meeting begins

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో భేటీ ప్రారంభమైంది. సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్‌సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, విడుదల కావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై చర్చించనున్నారు.

1175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles