15న టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Thu,November 14, 2019 02:51 PM

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలపై చర్చించి.. ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు.

847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles