24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు శంకుస్థాపన

Wed,June 19, 2019 05:07 PM

TRS offices foundation stone in all district HQs to strengthen party

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో కార్యవర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. సభ్యత నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై చర్చించారు. ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. జూన్‌ 27వ తేదీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం కానుంది. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

1120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles