మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎంపీ రాములు

Mon,September 16, 2019 07:23 PM

హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు సోమవారం కలిశారు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఎలాంటి అనుమతులు ఇవ్వమని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు రాములు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం రాములు మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దూరమని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల అనవసర ఆరోపణలు చెంపపెట్టుగా తీర్మానం చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు యురేనియం తవ్వకాల విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. సమయం వచ్చినప్పుడల్లా పార్లమెంట్‌లో ఈ విషయంపై మాట్లాడాలని మంత్రి కేటీఆర్ సూచించారు అని ఎంపీ రాములు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజల పక్షాన మరోసారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎంపీ రాములు పేర్కొన్నారు.

1510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles