కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి: నామా నాగేశ్వ‌ర‌రావు

Mon,June 24, 2019 05:06 PM

TRS MP Nama Nageshwar Rao demands national status for Kaleshwaram lift irrigation project

హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు అని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు అన్నారు. ఇవాళ ఆయ‌న లోక్‌స‌భ‌లో మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ‌లు చేశారు. కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో.. హైద‌రాబాద్‌కు కూడా తాగు నీరు స‌ర‌ఫ‌రా అవుతుందన్నారు. అతిపెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టును కొన్ని రోజుల క్రిత‌మే ముగ్గురు సీఎంలు ప్రారంభించార‌న్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాల‌ని కోరారు. ఇటువంటి ప్రాజెక్టుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్ ఇవ్వాల‌న్నారు. ప్రాజెక్టు గురించి స‌భ‌లో చ‌ర్చ చేప‌ట్టాల‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమ‌తులు తెచ్చుకున్నామ‌న్నారు. మూడేళ్ల‌లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామ‌న్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా నీటి సంక్షోభం పెరుగుతోంద‌న్నారు. 21వ శ‌తాబ్ధంలో ఇదే పెద్ద స‌మ‌స్య అన్నారు. నీటిని సంర‌క్షించే సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తులు క‌నుమ‌రుగు అవుతున్నాయ‌ని, అందుకే కాళేశ్వ‌రం లాంటి లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ట్లు ఎంపీ నామా తెలిపారు. రాష్ట్రంలో త‌లెత్తిన‌ నీటి స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. కిసాన్ స‌మ్మాన్ నిధి.. ఇది రైతు బంధు స్కీమ్‌తో స‌మానం అన్నారు. ప్ర‌తి రైతుకు ఏడాదికి మా ప్ర‌భుత్వం ప్ర‌తి ఎక‌రాకు 10వేలు ఇస్తున్నామ‌న్నారు. రైతు బీమా కింద 5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం రెసిడెన్షియ‌ల్ స్కూళ్లు ఓపెన్ చేశామ‌న్నారు. 16వ లోక్‌స‌భ‌లోనూ డిమానిటైజేష‌న్ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి స‌పోర్ట్ ఇచ్చామ‌న్నారు. మా ప్ర‌భుత్వం జీఎస్టీకి కూడా మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్నారు.

1084
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles