ఈ ఐదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం : ఎంపీ కవిత

Sat,March 30, 2019 01:20 PM

TRS MP kavitha participate in election campaign

నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో అనేకమైన మంచి పనులు చేసిందని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తెలిపారు. బోధన్‌ నియోజకవర్గంలోని నవీపేట్‌ మండలంలో ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు న్యాయం జరిగింది. గతంలో సాగునీటికి ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. కాంగ్రెస్‌ హయాంలో నిజాంసాగర్‌ను నిర్లక్ష్యం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సింగూరు జలాలను నిజాంసాగర్‌కు తరలించాం. నిజాం సాగర్‌ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇస్తున్నాం. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నాం. రైతులు అడగక ముందే రైతులకు 24 గంటలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. గతంలో సబ్‌స్టేషన్ల కోసం రైతులు చెప్పులరిగేలా తిరిగేవారు. ఇప్పుడు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సమస్యలు లేవు. మే 1వ తేదీ నుంచి పెన్షన్లు రెట్టింపు అవుతున్నాయి. 800 మంది వికలాంగ సోదరులకు అన్ని విధాలా అండగా ఉన్నాం. బీడీ కార్మికుల గురించి కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించలేదు. తనకు చేతనైనంత అభివృద్ధి చేశాను. మన హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడాను. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే దేశవ్యాప్తంగా జరగాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు అవుతున్నా.. భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఈ ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంతో పాటు మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటేయాలి. దేశంలో మార్పు కోసం యత్నిస్తున్నాం అని కవిత పేర్కొన్నారు.

846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles