పదవుల కోసం పెదవులు మూసుకున్న వ్యక్తి జీవన్‌రెడ్డి

Thu,October 11, 2018 03:35 PM

TRS MP Kavitha fire on Congress leader Jeevan reddy

జగిత్యాల : కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆదరించేంత గొప్ప మనిషేం కాదని.. పదవుల కోసం జీవన్‌రెడ్డి పెదవులు మూసుకున్నారని కవిత విమర్శించారు. కేసీఆర్ మీద పోటీ చేసినందుకు కానుకగా జీవన్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఆగడాలు భరించలేకనే కేసీఆర్ ఆమరణదీక్షకు దిగారు అని గుర్తు చేశారు. మరోసారి తెలంగాణను మోసం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ ఏకమయ్యాయని తెలిపారు. ఉద్యమంలో ఏనాడైనా కాంగ్రెస్ నాయకులు కనిపించారా? తోడేళ్లు ముసుగు వేసుకొని వస్తే జనం గుర్తు పట్టరా? కేసీఆర్ ఓటమి ఎరుగని నాయకుడు. ప్రజల దీవెనతో ఒక్కసారి కూడా కేసీఆర్ ఓడిపోలేదని గుర్తు చేశారు.

సూత్రధారి, పాత్రధారి కాంగ్రెస్ దృష్టిలో నిర్దోషులా?
ఓటుకు నోటు కేసులో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని జీవన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడా సూత్రధారి, పాత్రధారి కాంగ్రెస్ దృష్టిలో నిర్దోషులా? అని ప్రశ్నించారు. జగిత్యాల ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? జీవన్‌రెడ్డిది కుటుంబ పాలన అని ఒకనాడు ఎల్. రమణ అన్నారు. జీవన్‌రెడ్డి అనుచరులంతా గూండాలు, రౌడీలని చెప్పిన రమణకు ఇప్పుడు వాళ్లు ముద్దొస్తున్నరా? ఎల్. రమణ ప్రజలకు పనికిరాని నాయకుడని జీవన్‌రెడ్డే అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న జీవన్‌రెడ్డి, ఎల్. రమణ ఇప్పుడెలా ఒక్కటయ్యారు? అని కవిత ప్రశ్నించారు.

ఏది నిజమో జీవన్‌రెడ్డి చెప్పాలి
జీవన్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తన భూముల చుట్టూ రోడ్డు వేసుకోలేదా? జీవన్‌రెడ్డి తన భూముల ధరలు పెంచుకునేందుకు కొండగట్టు దగ్గర జేఎన్టీయూ ఏర్పాటుకు సహకరించలేదా? రూ. 16 కోట్ల జనం డబ్బుతో జీవన్‌రెడ్డి తన తమ్ముళ్ల భూముల చుట్టూ బైపాస్ రోడ్డు వేసిన సంగతి నిజం కాదా? జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదు. జీవన్‌రెడ్డి 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తనకు మచ్చ బొల్లారం సర్వే నెం. 164లో 933 గజాల స్థలం ఉందని, దాని విలువ రూ. 15 లక్షలు అని పేర్కొన్నారు. మళ్లీ 2014 ఎన్నికల అఫిడవిట్‌లో అదే స్థలంలో రూ. 8 వేల పైచిలుకు గజాల స్థలం ఉందని, దాని విలువ రూ. 20 లక్షలు అని పేర్కొన్నారు. రెండుసార్లు సమర్పించిన అఫిడవిట్‌లో ఏది నిజమో జీవన్‌రెడ్డి చెప్పాలి. రెండు అఫిడవిట్‌లను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందన్నారు ఎంపీ కవిత.

2619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles