బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ : ఎంపీ కవిత

Mon,April 8, 2019 12:51 PM

TRS MP Kavitha fire on BJP Politics

నిజామాబాద్‌ : భారతీయ జనతా పార్టీపై నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఆ పార్టీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. నందిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఇవాళ విడుదలైన బీజేపీ మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశాన్ని పెట్టలేదు. అది భారతీయ జనతా పార్టీ కాదు.. భారతీయ ఝూటా పార్టీ. రాంమాధవ్‌కు సవాల్‌ చేస్తున్నా చిత్తశుద్ధి ఉంటే ఆ అంశాన్ని ఇప్పటికైనా మేనిఫెస్టోలో చేర్చాలి. ఇటీవల ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో రాంమాధవ్‌ మాట్లాడుతూ.. పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో పెడుతామని చెప్పారు. ఇప్పుడేమో ఆ అంశమే ప్రస్తావన లేదు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని కవిత ప్రశ్నించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తోంది. తాము పసుపు బోర్డును సాధించుకుని తీరుతాం అని కవిత స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు. కులవృత్తులకు భారీగా నిధులు కేటాయించి ఆదుకుంటున్నాం. త్వరలోనే పాడిపశువులను కూడా ఇస్తాం. రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల కింద అర్హులైన వారికి రుణాలు ఇస్తున్నాం. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. మే 1వ తేదీ తర్వాత ఇప్పుడున్న పెన్షన్లు రెట్టింపు కాబోతున్నాయి. ఎక్కువ సంపద సృష్టించాలనే విధంగా ప్రభుత్వం ముందుకు పోతోంది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నాం. ఈ ఇండ్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అవినీతికి తావు లేకుండా అర్హులైన వారికి ఇండ్లను కట్టించి ఇస్తున్నాం. సొంత జాగలో ఇండ్లు కట్టుకునే వారికి రూ. 5 లక్షలు సాయం చేస్తాం. ప్రతీ గ్రామంలో కూడా ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తాం అని ఎంపీ కవిత తెలిపారు.

947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles