క్యూలో నిలబడి ఓటేసిన ఎంపీ కవిత

Fri,December 7, 2018 10:11 AM

TRS MP Kavitha cast her vote in Telangana Elections

నిజామాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడానికి ఉత్సాహంగా కదిలి వచ్చారు. టీఆరెస్ ఎంపీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో కవిత ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేయడం విశేషం. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి ఓట్లు వేశారు. మరోవైపు ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం పోలింగ్ నమోదైంది.


3213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles