తెలుగు టీచర్‌గా ఎంపీ కవిత.. వీడియో

Tue,December 19, 2017 03:12 PM

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తండ్రికి దగ్గ కూతురు అనిపించుకున్నారు. కవిత కూడా సాహితీ అభిమాని అని ప్రపంచ తెలుగు మహాసభల వేదిక ద్వారా తెలిసింది. తెలంగాణ సంస్కృతి, సాహిత్యంపై అనేక పరిశోధనలు జరిపి తెలంగాణ జాగృతి నేతృత్వంలో కవిత ఇప్పటికే పలు పుస్తకాలు ముద్రింపజేశారు. తెలంగాణ సంస్కృతిని రాబోయే తరాలకు అందించేందుకు ఆమె చేసిన విశేష కృషి ఎనలేనిది. ఇక ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా తెలుగు ప్రాచీన చరిత్ర, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వివరాలను అలవోకగా చెప్పేశారు. ఈ క్రమంలో ఎంపీ కవిత సాహితీ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్ర భారతిలో ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై జరిగిన కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై తెలుగు భాష ప్రాచీనత, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వివరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది.


ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్యం మేల్కొని జూలు విదుల్చుకుంది. ఈ జూలు విదుల్చుకున్నటువంటి సందర్భంలో ఒక పదం ఉంటుంది. ఆ పదం సింహావలోకనం. అంటే సింహం ఏం చేస్తుందంటే.. సింహాం మూడు అడుగులు ముందుకు వేసి మళ్లీ తిరిగి ఠీవిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ విధంగా తెలంగాణ సాహిత్యం మేల్కొన్నటువంటి సందర్భంలో మనందరం కూడా సింహావలోకనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేశాను. టైపు చేయడం ఇబ్బందిగా మారడంతో.. తానే స్వయంగా తన చేతి వ్రాతతో రాశాను. నా భయంకరమైన చేతి వ్రాతను కాసేపు భరించాలి. తెలుగు భాష ప్రాచీనత, తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక చోట చేర్చానని కవిత పేర్కొన్నారు. క్రీ.పూ. 3 శతాబ్దం నుంచి మొదలుకొని.. తెలుగు భాష ప్రాచీనతను సవివరంగా వివరించిన ఆమె.. నేటి నవీన యుగం వరకు ఉన్న తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వివరాలను కవిత క్లుప్తంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.

4707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles