ఈ 21న టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన: సీఎం

Tue,March 19, 2019 07:54 PM

TRS MP candidates list will announce on this 21st says cm kcr

నిజామాబాద్: ఈ నెల 21వ తేదీన టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. నిజామాబాద్ టీఆర్‌ఎస్ పార్లమెంటరీస్థాయి సన్నాహక బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మొన్న ఎన్నికల్లో మీరు మమ్మల్ని గెలిపించారు. ఐదేండ్లు పరిపాలన చేయాలి. మరి ఒక బండి ముందటికి పోవాలంటే అయితే రెండు కోడెలాగలు కట్టాలి.. లేకపోతే రెండు దున్నపోతులను కట్టాలి. కానీ ఓ పక్కన దున్నపోతును ఇంకోపక్క కోడెలాగను కడతా అంటే బండి ముందుకుపోదన్నారు. మొన్న ఎమ్మెల్యేలందరిని గెలిపించినారు. ఇప్పుడు ఎంపీలను కూడా 16కు 16 గెలిపించాలన్నారు. ఆ శక్తితోని ఆ బలంతోని రాష్ర్టాన్ని బాగుచేసుకోవడమే కాదు కచ్చితంగా దేశానికి కూడా ఒక మార్గదర్శనం చేద్దామన్నారు. దానికి మీ దీవెన, మీ సహకారం కావాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి కారు గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాని సీఎం పేర్కొన్నారు.

2612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles