బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసింది కాంగ్రెస్సే : ఎమ్మెల్నీ కర్నె

Sat,January 27, 2018 03:09 PM

TRS MLC Karne Prabhaker responds on Boddupalli Srinivas murder

హైదరాబాద్ : నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ హత్యపై న్యాయ విచారణ జరగాలన్నారు. హంతకులకు కఠినంగా శిక్ష పడాలన్నారు. నిందితులు మాండ్ర మల్లేష్, రాంబాబు, శరత్ కాంగ్రెస్ కార్యకర్తలే అని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేతలు బురదజల్లడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు తమ నీచబుద్ధిని బయటపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అరాచక పాలన కొనసాగిందని కర్నె ప్రభాకర్ అన్నారు.

2491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles