స్వామి పరిపూర్ణానందవి పగటి కలలు : కర్నె ప్రభాకర్

Mon,November 5, 2018 11:53 AM

TRS MLC Karne Prabhaker fire on Swamy Paripurnananda

హైదరాబాద్ : రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తాను ముఖ్యమంత్రి అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటి కలలు కంటున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మతాలపై ఆధారపడిన పార్టీ బీజేపీ. బీజేపీ నేతలు మరో స్వామిని ఎన్నికల్లోకి తీసుకువచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు పరిపూర్ణానంద అబద్దాలు చెప్పకూడదు. ఆంధ్రా ప్రవచనాలను తెలంగాణ మీద రుద్దుతే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో నిలదీసినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టును విభజించమంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదు. ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తేల్చిచెప్పారు.

2460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles