ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరు : ఎమ్మెల్సీ కర్నె

Wed,February 21, 2018 01:58 PM

TRS MLC Karne Prabhaker fire on Congress Leaders

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో కర్నె ప్రభాకర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. పార్టీ పదవులు కాపాడుకునేందుకే కాంగ్రెస్ బస్సు యాత్ర చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విపక్షాలు అభివృద్ధి నిరోధకంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు.

1155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles