కాంగ్రెస్ నేతలవి అర్థం లేని విమర్శలు: ఎమ్మెల్సీ కర్నె

Fri,October 20, 2017 04:43 PM

TRS MLC Karne Prabhaker fire on congress and TDP Leaders

హైదరాబాద్ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ రైతులు దగాపడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో చేసిన పాపాలకు క్షమాపణలు చెబితేనే రైతులు.. కాంగ్రెస్ నేతలను క్షమిస్తారని చెప్పారు. రైతులను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటు అయిందన్నారు. జైపాల్‌రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ. కల్వకుర్తి ఎత్తిపోతలకు 1981లో డిజైన్ రూపొందిస్తే 2014 వరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని జైపాల్‌రెడ్డిని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles