ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే..

Fri,February 22, 2019 04:23 PM

TRS MLC Candidates names release by CM KCR

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హోంమంత్రి మహముద్‌ అలీ, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. మరొక సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.


ఈ నెల 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణ ఉంటుంది. మార్చి 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

4791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles