మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఎమ్మెల్యేలు

Fri,August 17, 2018 03:50 PM

TRS MLAs Condemned Congress Leaders Allegations on KTR

హైదరాబాద్: పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. కరీంనగర్‌ను కాంగ్రెస్ నాయకులు బొందల గడ్డగా మార్చారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అది చూసిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకుల పాలనను ఎండగట్టారని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవ వల్లే కరీంనగర్ ప్రపంచానికి తెలిసింది. అధిక నిధులు ఇచ్చి కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ హయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌కు లేదు. పొన్నం తక్షణమే క్షమాపణలు చెప్పాలి. పుట్టిన గడ్డకు ద్రోహం చేయవద్దని పొన్నం ప్రభాకర్‌కు గంగుల సూచించారు.

రాహుల్ గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. రాహుల్ ఇక్కడే అడ్డా వేసినా టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోలేరు. కాంగ్రెస్ నాయకులకు కామన్ ఎజెండాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టులపై కేసులు పెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు 100 సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులతో మేం ఎలాంటి చర్చలకైనా సిద్ధమని సవాల్ విసిరారు.

2566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles