ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే గువ్వల

Fri,October 18, 2019 10:19 PM

నాగర్ కర్నూల్ : అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం హైదరాబాద్‌ తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక చాంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. తన చాంబర్‌లో గువ్వల బాలరాజు సతీమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గువ్వల బాలరాజుకు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్‌ సభ్యులు రాములు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, వైస్‌ చైర్మెన్‌ బాలాజీసింగ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.


అదేవిధంగా నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్‌, లింగాల, అమ్రాబాద్‌, పదర, వంగూరు, చారకొండ, ఉప్పునుంతల, అచ్చంపేట మండలాల నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు, కుల, ప్రజా సంఘాల నాయకులు, విధ్యార్థి సంఘాలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. విప్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు విప్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల ఆంకాంక్షల మేరకు పనిచేస్తానని అన్నారు. ప్రజల ఆశీర్వాధాలతోనే తనకు సీఎం కేసీఆర్‌ విప్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని భరోసానిచ్చారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles