కేసీఆర్‌ ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రి : ఎమ్మెల్యే గాదరి

Sat,September 14, 2019 02:58 PM

హైదరాబాద్‌ : కేసీఆర్‌ ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రి అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా గాదరి కిషోర్‌ మాట్లాడారు. ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ అద్భుతమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వాస్తవికంగా ప్రజలకు దగ్గర ఉన్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ప్రజాశ్రేయస్సుకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలకు కట్నం ఇవ్వలేక పేద కుటుంబాలు బాధపడేవి. కట్నాలకు భయపడి కొన్ని గిరిజన కుటుంబాలు ఆడపిల్లలను విక్రయించేవారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆడబిడ్డలకు అండగా నిలిచాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అన్ని సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకెళ్తున్నాయని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ స్పష్టం చేశారు.

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles