నా పెళ్లి చేసింది పద్మారావే : బాల్క సుమన్

Mon,February 25, 2019 11:39 AM

TRS MLA Balka Suman praises on Deputy Speaker Padmarao goud

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. పద్మారావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనవర్సిటీలో ఉన్న తమకు పజ్జన్నా పూర్తస్థాయిలో వెన్నుదన్నుగా నిలిచారు. ఆ సమయంలో తమకు తోడ్పాటు, సహకారాన్ని అందించి అండగా నిలిచారని గుర్తు చేశారు. 2012లో తన పెళ్లి చేసింది పద్మారావు అన్ననే అని తెలిపారు. తన అత్తమామ పెళ్లికి ఒప్పుకోకపోతే.. పద్మారావు అన్న పెద్దమనసుతో మూడు నెలల కాలంలో రెండు విడుతలుగా వారితో మాట్లాడి తమ ప్రేమ వివాహానికి ఒప్పించారని గుర్తు చేశారు. ఆ తర్వాత దగ్గరుండి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పద్మారావు డిప్యూటీ స్పీకర్ కావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు అని బాల్క సుమన్ కొనియాడారు.

9091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles