వికారాబాద్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Fri,March 31, 2017 02:19 PM

trs membership programme in vikarabad district


వికారాబాద్ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వాడవాడల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లాలోని కొడంగల్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం పండుగలా కొనసాగుతున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, మహిళా సంక్షేమం, గ్రామ సీమల అభివృద్ధితో బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles