మలేషియాలో మంత్రి నిరంజన్ రెడ్డికి ఘనస్వాగతం

Mon,April 15, 2019 09:50 PM

TRS malaysia Unit welcomes minister niranjanreddy


తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, వాణిజ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మలేషియా పర్యటన సందర్భంగా.. తెరాస మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌలాలంపూర్ లో నిరంజన్ రెడ్డికి ఘనస్వాగతం పలికి సత్కరించారు. మలేషియాలోని వ్యవసాయ క్షేత్రాల అధ్యయనానికి..పర్యటనకు వెళ్లిన మంత్రి ఇక్కడి రైతులు అవలంభించే అత్యాధునిక పద్దతులను స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత ఇక్కడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన అనుభవాలను ఎన్నారైలతో పంచుకున్నారు. ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ..ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెరాస మలేషియా ఆధ్వర్యంలో చేసిన కారు ర్యాలీ, కాల్ క్యాంపైనింగ్, మిగిలిన ఎన్నారై శాఖల సభ్యులతో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొని తెరాస ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ది పతకాలను ప్రజలకు తెలియపరుస్తూ చేసిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు, అనుకోకుండా మరణించిన వారి పార్థీవ దేహాలను స్వదేశానికి తరలించడంలో తెరాస మలేషియా ఎన్నారై విభాగం తీసుకున్న చర్యలను అభినందించారు. తెరాస మలేషియా హెల్ప్ లైన్ నంబర్ +60 1118772234 ద్వారా ప్రజలకు ఎల్లవేలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు స్పందంచడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, జనరల్ సెక్రెటరీ కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,జీవన్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

1070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles