కొడంగల్ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు!

Tue,September 25, 2018 07:43 PM

TRS leaders kick-start election campaign Kodangal

మహబూబ్‌నగర్: కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని.. 70ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించామని కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వ‌హించిన భారీ బహిరంగసభలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టామన్నారు. సంక్షేమ ఫలాలు వాడవాడలా అందుతున్నాయి. గత ప్రభుత్వాలు 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడు 24 గంటల కరెంటు ఎలా సాధ్యమైంది? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు అధికార దాహం తప్ప మరొకటి లేదు. ఏడాదిలోగా కొడంగల్ నియోజకవర్గానికి పాలమూరు ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందిస్తాం. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేది పాలమూరు కాంగ్రెస్ నేతలే. పాలమూరు అంటే వెనుకబడిన జిల్లా అని పేరుంది. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో వెనుకబడిన జిల్లాను ముందుకు తెస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొడంగల్‌లో 50 పడగల ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తెలంగాణ మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ దద్దమ్మలు రాజీనామా చేయమంటే భయపడ్డారు. దేశాన్ని, రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించిందే కాంగ్రెస్ . ఇది మన భవిష్యత్ బాగుచేసుకునే ఎన్నికలు. రైతును ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దే. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగు, సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాల్సిన బాధ్యత మనమీద ఉందని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మన బాస్‌లు ఢిల్లీలో లేరు.. తెలంగాణ గల్లీలో ఉన్నారని వివరించారు.

6702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles