బీజేపీకి వ్యతిరేకంగానే.. రైతులు 230 నామినేషన్లు

Tue,March 26, 2019 06:44 PM

trs leaders fires on bjp over setting up of turmeric board

నిజామాబాద్‌: పసుపు బోర్డు కోసం ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టడం బీజేపీకి తెలియదా? అని మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు బోర్డు కోసం ఎంపీ కవిత చేసిన కృషి దేశంలో అందరికీ తెలుసు. ఎర్రజొన్న రైతులను గత ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ హయంలో ఎర్రజొన్న రైతులకు న్యాయం జరిగింది. బీజేపీకి వ్యతిరేకంగానే రైతులు 230 నామినేషన్లు వేశారని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ కేంద్ర నాయకులు కళ్లు లేని కాబోదుల్లా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర, ఎర్రజొన్న మద్దతు ధర కోసం తొక్కని గడపలేదు, మొక్కని గుడి లేదు. పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో ఉంది. కొత్తగా వచ్చిన వాళ్లకు రైతుల గురించి ఏం తెలుసు. ఎర్రజొన్న రైతులకు న్యాయం చేసింది సీఎం కేసీఆర్‌, ఎంపీ కవితనే. గత ఐదేళ్లలో ఎంపీ కవిత ఏం చేసిందో నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు తెలుసు. తెలంగాణలో మొట్టమొదటి సెజ్‌ను ఆర్మూర్‌ లక్కంపల్లిలో సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారని జీవన్‌రెడ్డి వివరించారు.

2589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles