ఆ ఫ్లై ఓవర్ల నిర్మాణం త్వరలోనే పూర్తి : కేటీఆర్

Mon,November 6, 2017 01:13 PM

TRS Govt will complete Amberpeta and Balanagar fly overs says KTR

హైదరాబాద్ : నగరంలోని అంబర్ పేట్, బాలానగర్ ఫ్లై ఓవర్ల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ. 367 కోట్ల వ్యయంతో 1.6 కిలోమీటర్ల అంబర్ పేట ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూసేకరణకు చేపట్టామన్నారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ. 387 కోట్ల వ్యయం అవుతుందన్న మంత్రి.. భూ సేకరణ కోసం రూ. 265 కోట్లు రాష్ట్రప్రభుత్వం భరిస్తుందన్నారు. 2.2 కిలోమీటర్ల మేర బాలానగర్ ఫ్లైఓవర్ ను నిర్మిస్తామన్నారు.

గడువు లోపల ప్రతిగ్రామానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామన్నారు కేటీఆర్. 4125 గ్రామాల్లో నీటి అవసరాలు తీరుస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 183 గ్రామాల్లోనూ దశలవారిగా పనులు పూర్తి చేస్తామన్నారు. 2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు ఇచ్చితీరుతామన్నారు. నగరంలో నీటి అవసరాల కోసం 2 వేల 7 కిలోమీటర్ల పైప్ లైన్లు వేస్తున్నామన్నారు. 2018 కల్లా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.


2075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles