కేసీఆర్ కిట్లు.. గిరిజనులకు శుభవార్త..

Wed,June 13, 2018 04:25 PM

trs govt orders on KCR KITS exemption to Tribals in Telangana

హైదరాబాద్ : అమ్మకు ఆత్మీయతతో.. బిడ్డకు ప్రేమతో.. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే కేసీఆర్ కిట్ల విషయంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఇద్దరు సంతానానికి మాత్రమే కేసీఆర్ కిట్లు ఇవ్వాలన్న నిబంధనలు సడలింపు చేసింది. కోలం(మన్నేవార్లు), చెంచులు, కొండరెడ్లతో పాటు తోటి తెగలకు ఈ మినహాయింపు ఉంటుంది. ఇద్దరు పిల్లలు నిబంధనతో సంబంధం లేకుండా కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

కేసీఆర్ కిట్ పథకం పొందడం ఎలా..

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో గ‌ర్భిణిగా పేరు న‌మోదు చేసుకుని, వైద్య ప‌రీక్ష‌లను చేయించుకుని ప్ర‌స‌వించిన త‌ల్లికి కేసీఆర్ కిట్ పథకం వర్తిస్తుంది. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఈ పథకం కింద రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిచ్చిన వారికి రూ.12 వేల‌ను అందిస్తారు. ఈ నగదును వాయిదాల పద్దతిలో అందజేస్తారు.

మొద‌టి విడ‌త న‌గ‌దు:

ప‌్ర‌భుత్వాసుప‌త్రిలో గ‌ర్భిణిగా పేరు న‌మోదు చేయించుకుని క‌నీసం రెండు సార్లు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌రువాత రూ. 3వేలు అంద‌జేస్తారు.

రెండో విడ‌త న‌గ‌దు:

ప‌్ర‌భుత్వాసుప‌త్రిలో ప్ర‌స‌వించిన త‌రువాత ఆడ‌బిడ్డ పుడితే రూ.5వేలు, మ‌గ బిడ్డ పుడితే రూ. 4వేలు అంద‌జేస్తారు.

మూడో విడ‌త న‌గ‌దు:

బిడ్డ పుట్టిన‌ప్పటి నుంచి మూడున్న‌ర నెల‌ల కాలంలో ఇవ్వ‌వ‌ల‌సిన టీకాలు తీసుకున్న త‌రువాత రూ. రెండు వేలు

నాలుగో విడ‌త న‌గ‌దు:

బిడ్డ పుట్టిన‌ప్ప‌టి నుంచి 9 నెల‌ల కాలంలో ఇవ్వ వ‌ల‌సిన టీకాలు తీసుకున్న త‌రువాత రూ. మూడు వేలు ఇస్తారు. ఈ నాలుగు విడ‌త‌లుగా ఇచ్చే మొత్తం న‌గ‌దు బిడ్డ త‌ల్లి పేరుపై ఉన్న బ్యాంకు అకౌంట్లో జ‌మ అవుతాయి.

దీనితో పాటు రెండువేల విలువ చేసే 15రకాల వస్తువులతో కూడిన కిట్స్‌ను అందచేస్తారు. దీంతో పాటు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యే మాతా, శిశువులను అమ్మ ఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్తారు.

కిట్‌లో ఏమేముంటాయి

- దోమతెర (రూ.350)
- బేబీ మాస్కిటోస్ (రూ.90)
- దుస్తులు (రూ.200)
- రెండు టవల్స్ (రూ.100)
- బేబీ న్యాప్‌కిన్స్ (రూ.100)
- జాన్సన్ బేబీ పౌడర్ (రూ.120)
- బేబీ షాంపు (రూ.85)
- బేబీ ఆయిల్ (రూ.200)
- బేబీ సబ్బు (రూ.90)
- బేబీ సోప్ బాక్స్ (రూ.25)
- ఆట వస్తువులు (రూ.50)
తల్లి కోసం రూ.350 విలువచేసే రెండు చీరలు, రూ.40 విలువైన రెండు సబ్బులు, రూ.150 విలువైన కిట్‌బ్యాగ్, రూ.50 విలువ చేసే ప్లాస్టిక్ బకెట్ ఉంటాయి.

3718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles