ముస్లింల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం

Mon,June 19, 2017 04:18 PM

నాగర్‌కర్నూల్ : రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కల్వకుర్తి పట్టణంలో రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సమకూర్చిన రంజాన్ కిట్‌ను ఎమ్మెల్సీ కసిరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముస్లింల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఉద్ఘాటించారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను పేదవాళ్ళు సైతం ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తూందన్నారు. అందులో భాగంగానే పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు చేస్తున్న అభివృద్ధిని చూసి ముస్లింలు పెద్ద ఎత్తున సీఎంకు కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్నారని చెప్పారు.

468

More News

మరిన్ని వార్తలు...