ప్రజా రవాణా వ్యవస్థపై దృష్టి : కేటీఆర్

Fri,July 20, 2018 01:19 PM

TRS Govt concentration on Public Transport in hyderabad says KTR

హైదరాబాద్ : నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని.. ఈ అంశంపై దృష్టి సారించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొండాపూర్ వద్ద మల్టీ లెవల్ ైఫ్లె ఓవర్‌కు, గచ్చిబౌలి నుంచి హాఫిజ్‌పేట్ మార్గంలో నాలుగు లైన్ల ైఫ్లె ఓవర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.

పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతుంది. జనసాంద్రత పెరుగుతుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రజా రవాణా ఆశించిన స్థాయిలో లేదన్నారు. 34 శాతం మాత్రమే హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ వినియోగంలో ఉందన్నారు. ముంబై లాంటి నగరాల్లో 70 శాతం మంది ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. నగరంలో రూ. 23 వేల కోట్లతో 54 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బహుశా చరిత్రలో ఎన్నడూ జరగనంత రోడ్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రవాణా పెరిగే కొద్ది కాలుష్యం కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు కేటీఆర్.

ఆగస్టులో అమీర్‌పేట - ఎల్బీనగర్ మధ్య మెట్రో ప్రారంభం
అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో మార్గాన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ప్రజా రవాణా వైపు ప్రజలను మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles