టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం

Tue,May 21, 2019 10:02 PM

TRS clean sweep in Lok sabha elections says trsv vice president Thunga Balu

హైదరాబాద్: గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అదే విషయాన్ని ధృవీకరించాయని గుర్తు చేశారు. పదహారు స్థానాల్లో టీఆర్‌ఎస్, మరో స్థానంలో మిత్రపక్షమైన ఎంఐఎం విజయం సాధించనున్నాయని చెప్పారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉందనేదానికి ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నికలేవైనా ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే నిలస్తున్నారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.

2886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles