ఎంపీ కవితకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శుభాకాంక్షలు

Tue,January 22, 2019 05:52 PM

TRS Australia Congratulations to MP Kavitha

హైదరాబాద్ : ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా ఎన్నికైన నిజామాబాద్ ఎంపీ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, కార్యవర్గం శుభాకాంక్షలు తెలిపారు .
మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన కవిత ,ఇప్పుడు మన తెలంగాణ ఆడపడుచుల శక్తి ని, మహిళా సాధికారతను దేశం గర్వపడేలా కృషి చేస్తున్నారని నాగేందర్ రెడ్డి తెలిపారు . అడ్వైసరీ బోర్డు చైర్మన్ డా అనిల్ రావు చీటీ , వైస్ చైర్మన్ రాజేష్ రాపోలు,సత్యం రావు , వివిధ రాష్ట్ర అధ్యక్షులు సాయిరాం ఉప్పు , ప్రవీణ్ పిన్నమ, రవి సాయల, శ్రీకాంత్ రెడ్డి, రవి యాదవ్ , యూత్ వింగ్ అధ్యక్షుడు జస్వంత్ కొడరపు , మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీత ధూపాటి మరియు కార్యవర్గం కవితకుశుభాకాంక్షలు తెలిపారు.

1102
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles