ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Fri,February 17, 2017 11:31 AM

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కవిత, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అంనంతరం ఎపీ కవిత మాట్లాడుతూ... కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో జరుపుకోవడం అనవాయితీగా వస్త్తోంది. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్, అమరుల త్యాగమే తెలంగాణ రాష్ట్రమన్నారు. ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేదని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఛాయా చిత్రాల ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు.
బేగంపేట దేవనార్ అంధుల పాఠశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్ పాల్గొన్నారు.

1911

More News

మరిన్ని వార్తలు...