కొడుక్కి కేసీఆర్‌గా నామకరణం చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్త

Thu,December 27, 2018 08:33 AM

TRS activist named his son as KCR in Makthal

మక్తల్(మహబూబ్ నగర్) : ప్రాణాలకు తెగించి.. స్వరాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల కండ్లల్లో ఆనందాన్ని నింపిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వీరాభిమానిగా ఉంటూ నిత్యం టీఆర్‌ఎస్ కోసమే పని చేస్తున్నాడు మక్తల్ నియోజకవర్గంలోని గుర్లపల్లికి చెందిన తుప్పలి మల్లప్ప. అంతటితో ఆగకుండా కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో తన మూడు నెలల కుమారుడికి కేసీఆర్ అని నామకరణ చేసి అభిమానాన్ని చాటుకున్నాడు.

తుప్పలి మల్లప్ప తన కుమారుడికి కేసీఆర్ అని నామకరణం చేసిన విషయాన్ని తెలుసుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం గుర్లపల్లికి వెళ్లారు. టీఆర్‌ఎస్ కార్యకర్త ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ చిన్నారిని ఎత్తుకొని మల్లప్పను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అపర భగీరథుడు అయినటువంటి కేసీఆర్‌కు అభిమానులు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒక అభిమాని తన కుమారుడికి కేసీఆర్ అనే పేరు పెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు.

3678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles