ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు

Tue,August 6, 2019 08:18 PM

Treasury and Accounts Department celebrates Pro. Jayashankar Jayanthi

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో, సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలక పాత్ర మరువలేనిదని తెలంగాణ ట్రెజరీస్ శాఖ సంచాలకులు యాదగిరి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ హైదరాబాద్ అర్బన్ జిల్లాలో జయశంకర్ సార్ జయంతి వేడుకలను నిర్వహించింది. అదే విధంగా తెలంగాణ ట్రెజరీస్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. భూపాల్ రెడ్డి జయంతిని ఆ కార్యాలయ టీ.టీ.ఎన్.జీ.ఓ.ఏ సంఘ సభ్యులు జరుపుకోవడమైనది. వేడుకలో పాల్గొన్న సంచాలకులు యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం వదిలి అహర్నిశలు శ్రమించిన మహనీయుడని కొనియాడారు. ఆయన కలలుగన్న బంగారు తెలంగాణ సాధనకై పునరంకితమై ప్రతి ఉద్యోగి నిబద్ధత కలిగి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు కృష్ణ మోహన్, ఉప కోశాధికారులు అజర్ హుస్సేన్, నవీన్, కృష్ణ పద్మజ, టీ.టీ.ఎన్.జీ.ఓ.ఏ హైదరాబాద్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రోజలీన్, ప్రశాంత్ కుమార్, పుష్ఫలత, ట్రెజరర్ ముద్దసి ఆహ్మద్, ఉపాధ్యక్షుడు ముత్యాల రావు, సహాయ కార్యదర్శి నాగమణి, ఈసీ మెంబెర్ కవిత, సభ్యులు అజ్మత్, హారిక, దీన్ దయాల్, చంద్రబాబు, రాకేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles