రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వీడియో కాన్ఫరెన్స్

Wed,October 9, 2019 10:03 PM

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాటపట్టడంతో అధికారులు ప్రత్యామ్నయ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రోజూవారీ రవాణాపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ జేశారు. సమ్మె ప్రత్యామ్నయ ఏర్పాట్లపై సునీల్ శర్మ వివరాలు తెలుసుకుంటున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా రేపు మరిన్ని బస్సులను పెంచాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5,300 బస్సులు విధుల్లో ఉన్నాయని ఆయన అన్నారు.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles