20 నుంచి కృత్రిమ మేధస్సు, డాటా సైన్స్‌పై శిక్షణ

Wed,September 18, 2019 07:00 AM

హైదరాబాద్ : టెక్‌ప్రోయాక్ట్ లెర్నింగ్ ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో నగరంలోని ఖైరతాబాద్‌లో గల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్‌లో కృత్రిమ మేధస్సు, డాటా సైన్స్‌పై రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ- కామర్స్, సోషల్ మీడియా వేదికల ఆగమనంతో భారీ స్థాయిలో డాటా సేకరించడం జరుగుతుందని.. వాటిని విశ్లేషించి వ్యాపార కార్యకలాపాలను అంచనా వేయడం ఎలా? నిర్వహణ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? తదితర అంశాలపై చర్చిస్తారు. స్టాటిస్టికల్ టూల్స్, బిజినెస్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిశోధన, రక్షణ, ఆటోమొబైల్ తయారీ రంగంలో డాటా సైన్స్ అప్లికేషన్స్‌ను ఎలా వినియోగించాలి అనే విషయంపై అవగాహన కల్పిస్తారని టెక్‌ప్రోయాక్ట్ లెర్నింగ్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ టీవీ ప్రకాశ్ రావు అన్నారు. 20 నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు, ఆసక్తి గలవారు 9845690809కు ఫోన్ చేసి పేరు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.

830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles