పోస్టాఫీసుల్లోనూ..రైలు టికెట్లు

Fri,June 14, 2019 08:58 AM

train tickets in post offices

రైళ్ళలో ప్రయాణానికి బారులు తీరి క్యూకట్టడాలు ఒకప్పటి మాట...ఇప్పుడు ఆన్‌లైన్ కేంద్రాలతో పాటు బహిరంగ మార్కెట్‌లలో ఏర్పాటు చేస్తున్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్లతో ప్రయాణికులకు ఆ ఇబ్బందులు తీరిపోతున్నాయి. ప్రధానంగా ప్రయాణికుల తాత్కాలిక ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన తత్కాల్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విశేష ప్రజాదరణకు నోచుకుంది. దీంతో టికెట్ల వేటకోసం నెటిజన్లు పరుగులు తీస్తుండడంతో ఆన్‌లైన్ కేంద్రాలలో ఇవి సాధారణ ప్రయాణికులకు దక్కడం గగనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఈ ఆన్‌లైన్ రిజర్వేషన్ టికెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. స్థానికంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పోస్టాఫీసులలో ఈ రిజర్వేషన్ కౌంటర్‌లను ఏర్పాటు చేస్తోంది. రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ సేవలను విస్తృతం చేస్తూ స్థానిక పోస్టాఫీస్‌లలో వీటిని ఏర్పాటు చేస్తుండడంతో రైల్వే ప్లాట్‌ఫారమే మన ఇంటి ముందుకు వచ్చిన భావన కలుగుతుంది.

అహ్మద్‌నగర్: పోస్టాఫీసులలో రైల్వే రిజర్వేషన్ టికెట్లను అందుబాటులోకి తెస్తూ ప్యాసిం జర్ రిజర్వేషన్ సిస్టం(పీఆర్‌ఎస్) కౌంటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పోస్టల్ డివిజన్‌లోఎంపిక చేసిన సెక్రటెరియేట్ పీవో , హుమాయూన్ నగర్ పీవోతో పాటు సికింద్రాబాద్ డివిజన్‌లోని ముషీరాబాద్ పోస్టాఫీసులో అధికారులు ఈ విధానాన్ని ప్రయో గాత్మకంగా అమలు చేస్తున్నారు. అత్యవసర ప్రయాణం కోసం తత్కాల్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ ఆయా రిజర్వేషన్ టికెట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు బహిరంగ మార్కెట్‌లలో కౌంటర్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విధానం ద్వారా ప్రయాణికులకు పోస్టాఫీసులలో రైల్వే రిజర్వేషన్ టికెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హుమా యూన్ నగర్ పోస్టాఫీసులో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం(పీఆర్‌ఎస్) కౌంటర్‌ను హైదరా బాద్ నగర డివిజన్ పోస్టల్ కార్యాలయాల సీనియర్ సూపరింటెండెంట్ జి.హైమావతి ప్రారంభించారు . ఈ పోస్టాఫీసులలో ప్రయాణికులు సాధారణ టికెట్లు 120 రోజుల ముం దుగా , తత్కాల్ టికెట్లు 24 గంటల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తత్కాల్ లో ఏసీ రిజర్వేషన్‌ను ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించి , తత్కాల్ స్లీపర్ రిజ ర్వేషన్‌లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇస్తున్నామని , జనరల్ టికెట్లు నాలుగు నెలల ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చని హుమాయూన్ నగర్ సబ్ పోస్ట్ మాస్టర్ బి.విఠల్ రావు తెలిపారు.

తత్కాల్‌కు అనూహ్య స్పందన


అనుకోకుండా జరిగే సంఘటనలతో అత్యవసరంగా ప్రయాణమయ్యే వారికి కేటాయించిన తత్కాల్ రిజర్వేషన్ సౌకర్యం ఇంట్లో కూర్చుని బుకింగ్ చేసుకోవడం ఇప్పుడు సాధారణ ప్రయాణికులకు సాధ్యం కావడం లేదు. ఆన్‌లైన్‌లో 24 గంటల ముందు రిజర్వేషన్ చేసు కునే ఈ ప్రక్రియకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో దీనిని సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసులలో పిఆర్‌ఎస్ కౌంటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన తత్కాల్ విధానానికి అనూహ్య స్పందన రావడంతో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ దీనిని ప్రయోగాత్మకంగా పోస్టాఫీసులలో అమలు చేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ద్వారా ప్రవేశపెట్టిన ఈ తత్కాల్ విధానంలో 2002 సెప్టెంబర్‌లో ఒకే రోజు 5 లక్షల 82 వేల టికెట్లు , 2015 ఏప్రిల్ నెలలో ఒక్క రోజే 13 లక్షల 45 వేల 496 టికెట్లు అమ్ముడు పోయాయి. అత్యవసర రైలు ప్రయాణానికి ఏర్పాటుచేసిన తత్కాల్ సౌకర్యం మరింత విస్తృతం కావడంతో నేడు ప్రతిరోజు సుమారు 6 లక్షల బుకింగ్‌లతో 15 నుంచి 16 లక్షల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ విధానంపై ప్రయాణీకుల నుంచి విశేష స్పందన రావడంతో ఐఆర్‌సీటీసీ 2017 నుంచి టికెట్ బుకింగ్ వివరాలకు ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని సైతం కల్పించింది.

2469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles