గణేశ్ విగ్రహాల విక్రయాల నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు

Sat,September 8, 2018 07:04 AM

traffic restrictions in hyderabad for Ganesh idols

హైద‌రాబాద్‌: వినాయక విగ్రహాల విక్రయాలతో కోలహాలంగా ఉండే ధూల్‌పేట ప్రాంతంలో 9 ఉదయం 8 నుంచి 13న మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ధూల్‌పేట ప్రాంతంలో వినాయక విగ్రహాలను కొనేందుకు వచ్చే వారితో పాటు వాహనాలతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రజల భద్రతా దృష్ట్యా ఇక్కడ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు, విగ్రహాల కొనుగోలుకు వచ్చే వారు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

1. గాంధీ విగ్రహం, పురానపూల్ నుంచి వచ్చే వాహనాలు బోయిగూడ కమాన్ ఎక్స్ రోడ్డు నుంచి బయటకు వెళ్లాలి.
2.పురానపూల్, జుమ్మ్మెరాత్ బజార్ నుంచి ఆసిఫ్‌నగర్, అఘాపూర్‌కు మంగళ్‌హాట్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను గాంధీ విగ్రహం, పురానపూల్ వద్ద ఝాన్సీ చొరై, టీకర్‌వాడీ, ఘోడీ కీ కబర్, అఘాపూర్ వైపు మళ్లిస్తారు.
3. ఆసిఫ్‌నగర్, అఘాపుర వైపు నుంచి పురానపూల్, జుమ్మెరాత్ బజార్‌కు మంగళ్‌హాట్ మీదుగా వెళ్లే వాహనాలను బోయగూడ కమాన్ ఎక్స్ రోడ్స్ వద్ద అఘాపూర్, ఘెడీ కీ కబర్, ఝాన్సీ చొరై, టీకర్‌వాడి వైపు మళ్లిస్తారు.
4.దారుసలాం నుంచి మంగళ్‌హాట్ మీదుగా పురానపూల్ వైపు వెళ్లే వాహనాలను పాన్ మండి, ఘెడీ కీ కబర్, ఝాన్సీ చొరై, జుమ్మరాత్ బజార్ నుంచి పురానపూల్‌కు వెళ్లాలి.
5.గణేష్ విగ్రహాలు కొనుగోలు చేసి తీసుకెళ్లడానికి వచ్చే లారీ, డీసీఎం వాహనాలు జుమ్మెరత్ బజార్ గ్రౌండ్‌లో పార్కు చేయాలి. ఈ వాహనాలు రాత్రి 12 గంటల తరువాతే బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
6. ఆటోలు, కార్లలో పురానపూల్, జుమ్మెరాత్‌బజార్ నుంచి విగ్రహాలు కొనేందుకు వచ్చే వారు... తమ వాహనాలను 100 ఫీట్ల రోడ్డులో పార్క్ చేయాలి.
7.ఆసిఫ్‌నగర్, దారుసలాం వైపు నుంచి వచ్చే వాహనాలు సీతారాంబాగ్ ఆలయం గ్రౌండ్‌లో పార్క్ చేయాలి.

1998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles