హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Fri,June 8, 2018 11:32 AM

Traffic restrictions in Hyderabad city

హైదరాబాద్ : నగరంలో శుక్రవారం వివిధ చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చేపమందు పంపిణీ, ప్రభుత్వ ఇఫ్తార్, రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం ప్రార్థనలు ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
* చేప మందు కోసం కారుల్లో నాంపల్లి వైపు నుంచి వచ్చే వారు వాహనాలను గృహకల్ప, గగన్‌విహార్, చంద్ర విహార్ వద్ద నిలిపి ఎగ్జిబిషన్ మైదానం గేటు 2 నుంచి లోపలికి వెళ్లాలి. ఎంజే మార్కెట్ నుంచి వచ్చే వారు ఇంటర్మీడియట్ బోర్డు పక్కను ఎంఏఎం బాలికల జూనియర్ కాలేజీ వద్ద వాహనాలను నిలుపాలి.
* ఎంజే మార్కెట్, నాంపల్లి నుంచి బస్సులు, వ్యాన్లలో వచ్చే వారు గాంధీభవన్, గృహకల్ప వద్ద దిగి.. ఎగ్జిబిషన్ గేటు 2 నుంచి లోపలికి వెళ్లాలి.
* ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే వీఐపీ పాసులు ఉన్న వారు అజంతా గేటు, గాంధీభవన్ వద్ద ఎడమ వైపు తిప్పుకొని గేటు 1 నుంచి వెళ్లాలి. నాంపల్లి నుంచి వచ్చే వీఐపీ పాసులు ఉన్న వారు గాంధీభవన్ దగ్గర యూటర్న్ తీసుకొని గేటు 1లోకి ప్రవేశించాలి.
* ఎంజే మార్కెట్, నాంపల్లి నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు మనోరంజన్ కాంప్లెక్స్, గృహకల్ప, బీజేపీ కార్యాలయం మార్గంలో వాహనాలను పార్క్ చేసుకోవాలి.
* షేజాన్ హోటల్, భవానీ వైన్స్, ఎక్సైజ్ కార్యాలయం ప్రాంతంలో ఆటోల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు. వాటిని అక్కడే నిలుపుకోవాలి.
* ప్రభుత్వ వాహనాలు, భీంరావు బాడాలో పార్క్ చేయాలి.
* హెంఎండబ్ల్యూస్, చేపలను తీసుకువచ్చే మత్స్య శాఖ వాహనాలను గేటు 2 నుంచి అనుమతిస్తారు.
* పాసులు ఉన్న ఆహారాన్ని సరఫరా చేసే స్వచ్ఛంద సంస్థల వాహనాలను గేటు 2 నుంచి అనుమతిస్తారు.
* ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను అలాస్కా, దారుసలాం, ఏక్‌మినార్ నుంచి మళ్లిస్తారు.
ఈ దారి మళ్లింపులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు.

ఇఫ్తార్ సందర్భంగా..


ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
* ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి కేఎల్‌కే భవనం లేదా రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
* అబిడ్స్ నుంచి గన్‌ఫౌండ్రీ నుంచి వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, చాపెల్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
* బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి రోడ్డులో మళ్లిస్తారు.
* పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు..
* కింగ్‌కోఠి నుంచి వచ్చే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్ రోడ్డు, తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్..
* లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హిమాయత్‌నగర్ వైపు పంపిస్తారు.

చార్మినార్ వద్ద..

రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు చార్మినార్, మదీనా, ముర్గ్గీచౌక్, మొఘల్‌పురా కమాన్ ప్రాంతాల రోడ్లను మూసి వేస్తున్నారు. ఈ రూట్‌ల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన రహదారుల్లో ప్రయాణించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈ ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అమల్లో ఉంటాయి. ప్రార్థనలు పూర్తయ్యే వరకు ఈ మార్గాల్లో బస్సుల రాకపోకలను కూడా దారి మళ్లిస్తున్నారు.

879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles