శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Sat,March 9, 2019 12:18 PM

Traffic restrictions around Shamshabad area

రంగారెడ్డి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ దృష్ట్యా శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. శంషాబాద్ మీదుగా కర్నూలు, బెంగళూరు వెళ్లే వాహనాల దారి మళ్లింపును చేపట్టారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా శంషాబాద్ అవతల ఎన్‌హెచ్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ఆరాంఘర్-శంషాబాద్ మార్గంలోకి వెళ్లొద్దన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్‌గాంధీ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.

949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles