ప్రతి కదం.. 'ప్రగతి' పథం..!

Mon,September 3, 2018 06:50 AM

total telangana state headed to pragathi nivedana sabha

హైదరాబాద్: ఆదివారం నగరం గులాబీ రంగులద్దుకున్నది. వీధులు, దారులు, కూడళ్లన్నీ జన సంద్రమయినయ్. శ్రేణులన్నీ ప్రగతి నివేదన వైపే సాగినయ్. రాజధాని నుంచే 50 వేలకు పైగా వాహనాల్లో 3 లక్షలకు మించి జనం ప్రవాహమై కొంగరకలాన్‌కు పయనించారు. వారం రోజులుగా మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు చేపట్టిన సన్నాహక సమావేశాలతో భారీగా సభకు హాజరయ్యారు. డప్పుల దరువు, బతుకమ్మలు, పోతురాజుల సందడి, కోలాటం నృత్యాలు, బోనాల ఊరేగింపులతో.. గులాబీ జెండాలు పట్టుకొని పండుగ వాతావరణంలో తరలివెళ్లారు. నాలుగున్నరేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధిని సీఎం కేసీఆర్ సభకు వివరించారు. అశేష ప్రజానీకం కరతాళధ్వనులతో సీఎంకు అభినందనలు తెలిపారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో భూమ్యాకాశాలు హోరెత్తినయ్.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles