రేపు నల్లగొండలో కేటీఆర్ సభ

Fri,March 15, 2019 09:48 PM

tomorrow TRS meeting at Nalgonda

నల్లగొండ : నల్లగొండలో నేడు జరుగనున్న పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సభ ఏర్పాట్లను ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పరిశీలించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజక వర్గాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు ఈ సభకు హాజరు కానున్నారు. ఒక్కో నియోజక వర్గం నుంచి 3నుంచి 4వేల కార్యకర్తలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు కేటీఆర్ ఈ సభకు హాజరవుతారు.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles