రేపు షాద్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

Tue,September 4, 2018 09:23 PM

tomorrow Minister KTR tour in Shadnagar

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో రేపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కొత్తూరు మండల కేంద్రంలో నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో షాద్‌నగర్ పట్టణానికి చేరుకొని ఉదయం 10.30 గంటలకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆడిటోరియం, ఉదయం 10.40 గంటలకు మున్సిపల్ కార్యాలయం నూతన భవనం, ఉదయం 10.50 గంటలకు గుండ్లకుంట శివారులో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతులకు పాడి పశువులను పంపిణీ చేసి అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.

1976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles