భద్రాచలంలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

Fri,July 12, 2019 06:58 AM

Toli Ekadasi celebrations in Bhadrachalam temple

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారికి తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం స్వామివారికి అంతరాలయంలో మూల మూర్తులకు వజ్రవైడూర్య మరకత మాణిక్యాలతో, బెంగుళూరు భక్తులు స్వామివారికి సమర్పించిన రూ.5 కోట్ల విలువ చేసే బంగారు కవచాలతో ఉత్సవ మూర్తులకు అంతరాయలంలో ఏకాంత తిరుమంజనం గావించారు. తదుపరి ఉపాలయంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రాకార మండపంలో 108 మందితో విష్ణు సహస్ర నామ పారాయణం, సాయంత్రం 5 గంటలకు ఆరాధన, 6 గంటలకు సంధ్యా హారతులు, రాత్రి 7 గంటలకు రాజదర్బార్, 8 గంటలకు తిరువీధిసేవ, 9 గంటలకు చుట్టుసేవ, 10 గంటలకు ఆరాధన, ఆరగింపు నిర్వహించనున్నారు.

913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles